ఖుష్‌బూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. 1991 సంవత్సరం ఆమె కెరీర్ ను అనూహ్యంగా మలుపుతిప్పిన సంవత్సరంగా పేర్కొనాలి. తమిళంలో ఆమె నటించిన చిత్రం చిన్నతంబి అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. ప్రతి జిల్లాలో సినిమా విజయవంతం అయినందుకు వేడుకలు కూడా జరుపుకున్నారు.
అప్పట్లో ఆమెకు దేవాలయాలు కూడా కట్టారు. కొందరు అభిమానులు అయితే ఆమెకు రక్తంతో కూడా ఉత్తరాలు రాశారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో ఆమె నటించే అవకాశాలు దక్కాయి. ఇలా సినిమాలో ఆమె జీవితం ఎంతో విజయవంతగా సాగినా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పెళ్లైన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ప్రభుతో సంబంధం గురించి అప్పట్లో గుసగుసలు బాగా వినిపించేవి.
ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు రాకముందే ఆమె 1989లో ప్రభుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1993 సమయంలో ఒక పాపులర్ తమిళ డైలీలో ఈ వార్తను ఫ్రంట్ పేజీలో ప్రచురించడంతో.. ఆమెను ప్రతీ ఒక్కరు తిట్టుకున్నారు. ఒక సంసార జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టారు. ఆ క్రమంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొలగించారు. ఆ కారణంగానే ప్రభుతో ఆమె అనుబంధాన్ని తెంచేసుకుంది.
ఆ తర్వాత సినిమాలు చేయడం చాలా రోజుల వరకు మానేసింది. డైరెక్టర్ సి. సుందర్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా.. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఖుష్‌బూ భర్త సుందర్ దర్శకత్వంలో ప్రభు ఓ సినిమాలో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…