Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్

Doctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.

వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…

మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.

గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.