Naveen Brother : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గిరిజన యువకుడు నవీన్ హత్య కేసులో నిహారిక రెడ్డి ప్రమేయం ఉంది అంటూ నవీన్ కుటుంబం ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు నిహారిక రెడ్డిని ఇటీవలే అదుపులోకి తీసుకోగా ఈ విషయం గురించి నవీన్ తమ్ముడు మాట్లాడుతూ నిహారిక అలాగే హరిహర కృష్ణ కు ఉరిశిక్ష పడాలంటూ ఆకాంక్షించాడు. ఈ కేసులో ఇప్పటికే హరిహర, నిహారిక, హాసన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
వాళ్ళు బయటికి వస్తే చంపేసి జైలుకి వెళ్తా…
నవీన్ తమ్ముడు మీడియాతో మాట్లాడుతూ నిహారిక, హరిహర కు ఉరిశిక్ష పడాలని కోరుకున్నాడు. పోలీసుల మీద, వారి విచారణ మీద నమ్మకం ఉందని వాళ్ళు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. మొదటి నుండి నిహారిక వల్లే హరిహర హత్య చేశాడని నవీన్ తమ్ముడు ఆరోపించాడు. హరిహర కు నవీన్ ను హత్య చేసే అవసరం లేదని కేవలం నిహారిక వల్లే హత్య చేసాడని తెలిపారు.
విచారణ పూర్తయ్యాక బెయిల్ మీద హరిహర బయటికి వస్తాను అని అన్న వ్యాఖ్యల మీద మాట్లాడుతూ నిహారిక, హాసన్, హరిహర బయటికి వచ్చారంటే మాత్రం వాళ్ళను చంపి నేను జైలుకి వెళ్తాను. వాళ్ళు జైలు నుండి ఎలా బయటికి వచ్చారో నేను అలానే బయటికి వస్తాను అంటూ మాట్లాడాడు. అయితే పోలీసుల మీద నమ్మకం ఉందని అందుకే ఎటువంటి ధర్నాలు వంటివి చేయడం లేదని చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…