RK Roja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నటువంటి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా రోజూ మాట్లాడుతూ తనకు పెళ్లి కాకముందే ఫైబ్రాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్య కారణంగా నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. తనుకు 2000 సంవత్సరంలో లాప్రోస్కోపీ జరిగిందని 2002లో పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే తనకు పిల్లలు పుట్టరనే ఆందోళన తనని ఎప్పుడు వెంటాడుతూనే ఉందనీ అయితే భగవంతుడి దయవల్ల తనకు పెళ్లి అయిన వెంటనే కన్సీవ్ అయిందని తెలిపారు.
ఇలా పెళ్లి తర్వాత 2003 వ సంవత్సరంలో పాప నా కడుపున పడిందని అందుకే తనకు తన కుమార్తె అంటే పంచప్రాణాలు అని రోజా ఈ సందర్భంగా తెలిపారు. పిల్లలే పుట్టరనుకున్న నాకు ఇలా పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు కావడంతో ఈ శుభవార్తను ముందుగా డాక్టర్ కి చెప్పానని ఆమె ఈ శుభవార్త విని చాలా సంతోషించారని తెలిపారు.
ఇలా పిల్లల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడిన తనకు తన పిల్లలంటే పంచప్రాణాలు అందుకే వారి జీవితం వారికి నచ్చిన విధంగానే ఉండాలనుకుంటాను అంటూ ఈ సందర్భంగా తన పిల్లల గురించి రోజా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక రోజా కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్ ఉన్నత చదువులలో రాణిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…