Comedian Raghu: కమెడియన్ రఘు పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రఘు ప్రస్తుతం వెండితెరకు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటూ లిక్కర్ వ్యాపారంలో స్థిరపడ్డారు.ఇలా బిజినెస్ చేసుకుంటూ సినిమాలకు దూరమైనటువంటి ఈయన తాజాగా ఓ ఖరీదైన ఇంటిని నిర్మించినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ ఇంటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్ రఘు ఇల్లు ముందు ఇంద్ర భవనం కూడా తీసిపోతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. పాలరాతి భవనంలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఈ ఇంటిని కనుక చూస్తే ఎవరైనా కల్లా అర్పకుండా చూడాల్సిందే.
లాక్ డౌన్ ముందు వరకు సినిమాలు బుల్లితెర కార్యక్రమాలలో నటించిన ఈయన లాక్ డౌన్ లో కాస్త ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనంతరం లిక్కర్ వ్యాపారం లోకి అడుగుపెట్టిన ఈయన ఏకంగా రెండు వైన్ షాపులకు ఓనర్ గా మారి వ్యాపారంలో బాగా లాభాలు పొందినట్టు తెలుస్తుంది. ఇలా వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించినటువంటి కమెడియన్ రఘు కోట్లు విలువచేసే ఖరీదైన భవనాన్ని నిర్మించారు.
ప్రస్తుతం ఈయన ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇంటిని కనుక చూస్తే ఒక్క క్షణం పాటు ఈ లోకాన్ని మర్చిపోతామని చెప్పాలి. ఇంటి మొత్తం పచ్చదనంతో నింపారు. ఇక ఈయన ఇంటి ఆవరణంలో పండని కూరగాయ, కాయని పండ్లు అంటూ లేవని చెప్పాలి. ఇంటి బ్యాక్ యార్డ్, టెర్రస్ పై అన్ని రకాల పువ్వులు పండ్లు, కూరగాయల మొక్కలను నాటారు.ఇలా మొక్కలపై ఈయనకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటో ఈ హోమ్ టూర్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…