Janasena: గ్లాస్ గుర్తుపై ఏర్పడిన గందరగోళం… ఓటమి భయంతో వైసీపీ కుట్ర!

Janasena: రాష్ట్రవ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తుపై గందరగోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ గుర్తు అనే సంగతి తెలిసిందే అయితే జనసేన పార్టీ గుర్తును ఫ్రీ సింబల్స్ లో చేర్చడం పట్ల తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గాజు గ్లాసు గుర్తుకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఈ గుర్తును ఫ్రీ సింబల్స్ కింద పెట్టారు.

JanaSena-Chief-Pawan-Kalyan-Interaction-with-JanaSena-Party-Activists-of-Panyam-Constituency--Gallery-

ఈ జనసేన పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయిస్తారు ఎక్కడైతే ఈ పార్టీ అభ్యర్థులు లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఉంటారో అక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున గందరగోల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా జనసేన వ్యక్తం చేసిన అభ్యంతరం ఈసీ పరిశీలనలో ఉందని 24 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఈసీ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు.

ఇలా ఒక పార్టీకి రిజర్వ్ చేసినటువంటి ఒక గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించకూడదు కానీ దాదాపు 50 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు ఏమి ఏమి లక్షిత్ లేదు కేటాయించడంతో వెంటనే జనసేన అభ్యర్థులు ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అభ్యంతరాలపై ఈసీ ఏ క్షణమైన తననిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ సానుకూలంగా నిర్ణయం తసుకోకపోతే హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

వైసిపి కుట్రలో భాగమా..
ఇప్పటికే జనసేన పార్టీ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తించడంతో జనసేన ఓట్లను చీల్చి ఓటమికి గురి చేయవచ్చు అన్న ఆలోచనతోనే స్వతంత్ర అభ్యర్థుల చేత వైసిపి నేతలు నామినేషన్లు వేయించి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.