Ekta Sharma: అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న నటి… దారుణమైన పరిస్థితులలో సీరియల్ నటి!

Ekta Sharma: ఈ సినీ ప్రపంచంలో ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా తలకిందులవుతాయో ఎవరికీ తెలియదు. అప్పటివరకు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి వారి జీవితాలు కూడా ఒక్కోసారి తారు మారవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ఒకానొక సమయంలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగిన వారు కూడా చివరి రోజులలో ఎంతో దయనీయ స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇలా ఇండస్ట్రీలో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటి ఏక్తా శర్మ కూడా ఒకరు.కరోనా లాక్ డౌన్ సమయంలో ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో జీవనం ఎంతో కష్టతరంగా మారిపోయిందని వెల్లడించారు.ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఇంటిని గడపడం కోసం తన నగలను కూడా అమ్మానని ఈమె తెలిపారు

Ekta Sharma:  అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం తప్పు..

 

ప్రస్తుతం తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని అయితే తనకు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తాను చదువుకున్న చదువుకు తగ్గట్టుగా కాల్ సెంటర్లో పని చేస్తున్నానని ఈమె తెలిపారు.మనకు అవకాశాలు లేకపోతే అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కన్నా ఏదో ఒక పని చేసుకోవడం ఉత్తమం అని భావించి తాను కాల్ సెంటర్ లో పని చేస్తున్నానని, ఇలా కాల్ సెంటర్లో పనిచేయడం తనకు ఏమాత్రం తప్పుగా అనిపించలేదంటూ ఈ సందర్భంగా నటి వెల్లడించారు. అయితే ఎప్పటికైనా తనకు అవకాశాలు వస్తాయని యధావిధిగా తాను ఇండస్ట్రీలో కొనసాగుతాననే నమ్మకం తనకు ఉందంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.