Featured

వ్యాక్సిన్ వేసుకున్న మాస్క్ తప్పనిసరి.. డబ్ల్యూహెచ్ వో డైరెక్ట్

Published

on

కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు ముగుస్తున్న కూడా ఇప్పటికీ అంతం అవ్వలేదు. అయితే తాజాగా కొన్ని ప్రదేశాలలో కరోనా మహమ్మారి అంతకంతకు రెట్టింపు అవుతోంది. చాలా మంది ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టిందని కోవిడ్ రూల్స్ ను పాటించడం లేదు.ఇంకొంతమంది అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకదని భావిస్తున్నారు.

ఇది తప్పు అంటూ తాజాగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘోబ్రేయేసస్ తెలిపారు. ఐరోపా అంతటా covid19 కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ,మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.మాస్క్ లు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడటంతో పాటు తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కోవిడ్-19 రాదు అనే తప్పుడు భద్రతా భావం గురించి మేము ఆందోళన చెందుతున్నాము. టీకాలు ప్రాణాలను కాపాడతాయి, అంతే కానీ అవి కరోనాను పూర్తిగా అడ్డుకోవు..అని టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ట్వీట్ చేశారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ 19 వేరియంట్ గురించి చర్చించడానికి WHO తాజాగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.

Advertisement

అయితే అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కరోనా వైరస్ జాతి కనిపించడంపై UK శాస్త్రవేత్తలు హెచ్చరించారని UK మీడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర COVID-19 వేరియంట్‌ల కంటే స్ట్రెయిన్ స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్ వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాలలో మరొకసారి కరోనా విజృంభిస్తుండడంతో భారత్ అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిని తప్పకుండా టెస్టింగ్ చేయాలని నిర్ణయించింది.

Advertisement

Trending

Exit mobile version