fans worrying about akkineni chaitanya and akhil stardom comparing with nagarjuna
King Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి అలానే అక్కినేని ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారి టైంలో ఒక ట్రెండ్ ను సెట్ చేసారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య, అఖిల్ తండ్రికి తగిన తనయులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ అక్కినేని యంగ్ హీరోలు.
ఇక నాగ చైతన్య మార్కెట్ ఈ ఏడాది కాస్త పెరిగిందనే చెప్పాలి లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు చైతన్య. అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు చేదు అనుభవాలుగా మిగిలాయి. అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తన ఖాతాలో హిట్ అందుకున్నాడు అఖిల్.
ప్రస్తుత చైతన్య థాంక్యూ సినిమాతో… అఖిల్ ఏజెంట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో కొడుకులందరూ వంద కోట్ల క్లబ్లో చేరుతుంటే అక్కినేని కుర్రాళ్ళు మాత్రం 30, 40 కోట్ల క్లబ్ లోనే ఉండిపోయారు. అయితే ఇటీవలే విడుదలైన బంగార్రాజు తో తండ్రి కొడుకులు 50 కోట్ల క్లబ్ లో చేరారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా బంగార్రాజు. పండుగ కానుకగా విడుదల అయిన ఈ సినిమా 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ ఏడాదిలో మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. ఇప్పటి వరకు 10 రోజుల్లో 35 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 4 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ యంగ్ హీరోలు వంద కోట్ల క్లబ్ లో ఎప్పుడు చేరతారో…
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…