Hero Suman : శోభన్ బాబు గారి కూతురితో పరిచయం ఉన్నా ఆ విషయంలో ఆయన్ని అడగలేదు… ఆరు నెలలు జైల్లో మగ్గినపుడు ఏ హీరో నాకు సహాయం చేయలేదు…: హీరో సుమన్

Hero Suman : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు. తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులో మొదట ఇద్దరు ఖిలడీలు సినిమాతో మొదలు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి ‘సితార’ సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శోభన బాబు, కృష్ణం రాజు వంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సుమన్ గారు ఆయన నటనకు నంది అవార్డు కుడా అందుకున్నారు.

జైల్లో ఉన్నపుడు ఎవరూ నన్ను పట్టించుకోలేదు…

సుమన్ కెరీర్ పీక్స్ లో ఉండి తెలుగులో సూపర్ హిట్స్ అలాగే తమిళం లోను బాగా బిజీగా ఉన్న సమయంలో ఆయన మీద నీలి చిత్రాల్లో నటించాడు అన్న మచ్చ పడింది. ఇక రాత్రికి రాత్రే ఆయనను అరెస్ట్ కుడా చేసారు ప్రాస్టిట్యూషన్ కేసులో. ఆ సమయంలో ఇండస్ట్రీ నుండి ఎవరూ సుమన్ కి సహాయం చేయలేదు. బిజీగా ఉన్న ఒక హీరో అలాంటి పనిచేయాల్సిన పని లేదని చెప్పినా వినిపించుకోలేదు. తమిళం నుండి సుమలత, సుహాసిని వంటి హీరోయిన్స్ మాత్రం పత్రికా ముఖంగా సుమన్ అలాంటివాడు కాదని, చాలా డీసెంట్ గా సెట్స్ లో ఉంటారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తెలుగు పత్రికలు సుమన్ గురించి తమిళ పత్రికల కథనాలను వేస్తూ సుమన్ అలాంటివాడు కాదు అంటూ చైతన్యపరిచాయట. అయినా ఆరు నెలలు జైల్లో మగ్గిన సుమన్ కు ఆ సమయంలో తనతో సమకాలికులుగా ఉన్న ఏ హీరోలు సహాయం చేయలేదని చెప్పారు.

కేవలం తెలుగు మీడియా నా గురించి మంచిగా కథనాలు రాసి జనంలో నన్ను నిలబెట్టారని చెప్పారు. ఇక తమిళంలో కుముదం అనే మ్యాగ్జైన్ లో కొంతమంది నాకు సపోర్ట్ గా మాట్లాడినా ఇంటర్వ్యూ మాత్రమే ఆ సమయంలో నాకు లభించిన మద్దతు అంటూ చెప్పారు. ఇక అవాకాశాల కోసం కానీ ఏదైనా సహాయం కోసం కానీ పరిచయాలను వాడుకోలేదా అనే ప్రశ్నకు శోభన్ బాబు గారి కూతురు మా అమ్మ దగ్గర చదువుకుంది. మృధుల గారు ఆయన కూతురు అని తెలిసినా ఆయన నేను కలిసి సినిమాలో చేసినపుడు ఆ విషయం చెప్పి చనువు పెంచుకోవాలనే ఆలోచన చేయలేదు. ఇక కృష్ణం రాజు గారు చాలా మంచి మనిషి, నన్ను తన సోదరుడిలా చూస్తారు కానీ ఆ పరిచయం ఉపయోగించుకోలేదు. కృష్ణ గారి కూతురు కుడా అమ్మ పనిచేసే కాలేజీ లోనే చదువుకునేవారు అయినా నేను పరిచయాలను ఉపయోగించుకోలేదు అంటూ చెప్పారు.