Actress RamyaSree : వైజాగ్ లో పుట్టి పెరిగిన నటి రమ్య శ్రీ ‘నువ్వు నేను’ సినిమాలో కాలేజీ లెక్చరర్ గా నటించి గుర్తింపు అందుకున్నారు. ఆపైన తప్పుచేసి పప్పు కూడు, ఆది, ప్రేమలో పావని కళ్యాణ్, సింహాద్రి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ‘ఓ మళ్ళీ’ అనే ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించిన రమ్యశ్రీ గారు ఆ సినిమాలో గిరిజన మహిళగా తన నటనకు నంది జ్యూరీ అవార్డును అందుకున్నారు. స్క్రీన్ రైటర్ గాను డైరెక్టర్, నిర్మాత, నటి ఇలా అన్ని రంగాల్లోను రాణించిన ఆమె కొంతమంది వ్యక్తుల చేతిలో మోసపోయానని డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేసారంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు.
శ్రీశైలం యాదవ్ ఇప్పటికీ లాండ్ ఇవ్వలేదు…
రమ్య శ్రీ గారు తనను ఆర్థికంగా మోసం చేసిన వారి గురించి మాట్లాడుతూ కుటుంబం సభ్యులు స్నేహితుల కోసం ఎంతో చేశాను, కోట్లు విలువ చేసే లాండ్ వదులుకున్నాను, అది ధర్మం. కానీ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని నమ్మి ఒకరి వద్ద లాండ్ కొంటే ఫ్రాడ్ చేసారు. టీడీపీ పార్టీ పేరు చంద్రబాబు పేరు వాడుకుని మోసం చేసారు. చంద్రబాబు వద్దకు వెళ్లి కూర్చుంటే నాకు న్యాయం జరుగుతుంది కానీ నేను వెళ్ళలేదు.
అతనిని నేరుగా ఇప్పటికీ అడుగుతున్నాను నాకు రావాల్సిన డబ్బు ఇవ్వమని అమరావతిలో స్థలం ఇప్పిస్తానని మోసం చేసాడు. నాకు ఓపిక ఉన్నంత వరకు పోరాడుతా నశించిన రోజు ఎంత దాకా అయినా వెళ్తాను అంటూ చెప్పారు. ఇక శ్రీశైలం యాదవ్ అనే మరో వ్యక్తి ఇప్పటికి డబ్బు తీసుకుని 15 ఏళ్ళు అయినా ఇంతవరకు లాండ్ ఇవ్వలేదు. అతని గురించి ఇప్పటికీ పోరాడుతున్నా, మొదటి సారి ఈ విషయాలను మీడియాలో చెబుతున్నాను అంటూ రమ్య శ్రీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…