Featured

Writer Kanagala Jayaram : వేటూరి వచ్చాక అత్రేయ, నారాయణ రెడ్డికి పాటలు లేకుండా పోయాయి… బాలసుబ్రమణ్యం హేళన చేసి పాడిన పాట ఇదే…: రైటర్ కనగల జయరాం

Writer Kanagala Jayaram : తెలుగు పాటకు అందం తెచ్చిన కవులలో వేటూరి సుందర రామమూర్తి గారు ఒకరు. సిరిసిరి మువ్వ సినిమాతో తెలుగు పాటకు పరిచయమైన ఆయన మొదట జర్నలిస్ట్ గా పనిచేసేవారు. అప్పట్లోనే సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మంచి అనుబంధం ఉన్నా ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే విశ్వనాధ్ గారి సిరిసిరిమువ్వ ద్వారా అటు గేయ రచయిత, మాటల రచయిత గా సినిమాకు పరిచయమైన ఆయన విశ్వరూపం శంకరాభరణం సినిమాతో చూపించారు. అందులోని ప్రతి పాట పండితుల నుండి పామరుల వరకు అందరినీ అలరించింది. అలాంటి గేయ రచయిత గురించి ప్రముఖ పాటల రచయిత కవి కనగల జయరాం గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆత్రేయ, నారాయణ రెడ్డికి అవకాశాలు పోయాయి…

వేటూరి గారు జర్నలిస్ట్ గా ఉన్నపుడే ఎంతో మంది సినిమా వాళ్ళు ఆయనను ఇండస్ట్రీకి ఆహ్వానించారు. అయితే ఆయన మాత్రం మొదట ఇండస్ట్రీ వైపుకి రాలేదు. ఇక విశ్వనాధ్ గారి సిరిసిరి మువ్వ సినిమాతో వచ్చిన ఆయన ఆ సినిమాలో పాటలను ప్రెస్ కి మొదట విడుదల చేసిన వెంటనే బాగా ప్రాచుర్యం పొందారు అంటూ జయరాం తెలిపారు. ఒక్కసారిగా ఆయనకు సినిమా అవకాశాలు పెరిగిపోయాయి. అప్పటివరకు ఉన్న ప్రముఖ పాటల రచయితలైన ఆత్రేయ, నారాయణ రెడ్డి లకు కూడా అవకాశాలు పోయాయి అంటూ జయరాం తెలిపారు. ఆత్రేయ గారు నారాయణ రెడ్డి గారు మంచి పాటల రచయితలే వారిని తక్కువ చేసే ఉద్దేశం లేదు అయితే ఆ సమయంలో కొత్తగా తెలుగు ప్రయోగాలను చేసిన వేటూరి గారికి ఎక్కువ మంది అవకాశం ఇచ్చారు అంటూ చెప్పారు జయరాం.

ఇక బాలసుబ్రమణ్యం గాత్రంలో వేటూరి గారి రచనలో ఎన్నో పాటలు వచ్చాయి. అలా శంకరాభరణం లోని పాటలు వేటూరి గారి కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు అంటూ చెప్పారు జయరాం. ఇక సిరిసిరిమువ్వ సినిమాలోని ‘రా దిగిరా దిగిరా’ అనే సాంగ్ ను బాలసుబ్రమణ్యం గారి అబ్బాయి చరణ్ వేరేగా పాడటంతో బాలు గారు ఆ పాటను హేళనగ మా అబ్బాయి పడుతాడు అంటూ చెప్పేవారు అంటూ జయరాం ఆయన అనుభవాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago