Social activist Krishna Kumari : సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసాడు. ఆమె మృతదేహన్ని మ్యాన్ హోల్ లో పడేసి ఆధారాలను లేకుండా చేసే ప్రయత్నం చేసాడు. ఇక ఈ హత్య కేసులో అప్సర ఎందుకు పెళ్ళైన మగాడి వెంటపడింది అనే కోణంలోనే మాట్లాడుతున్నారు కానీ సాయి కృష్ణ వైపు నుండి తప్పులు మాట్లాడటం లేదు, అదీ కాక ఇరు వైపుల నుండి ఒకరినొకరు విమర్శించుకోవడమే సరిపోయింది అంటూ సామాజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడారు.
ఇరు వైపులా తప్పులు ఉన్నా అప్సరను మాత్రమే టార్గెట్…
అప్సర గతం గురించి మాట్లాడుతూ ఆమె వైపు తప్పు ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్న చాలా మందికి సాయి కృష్ణ పెళ్ళై ఒక పాప ఉన్న వ్యక్తి పరాయి స్త్రీని ఎందుకు కోరుకున్నాడు అది తప్పు కదా అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు. సాయికృష్ణ బాధ్యతారహిత్యంగా వ్యవహరించాడు కాబట్టే నేడు జైలులో ఉన్నాడు అంటూ చెప్పారు. ఇక అప్సర సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో సాయికృష్ణ వల్ల పరిచయాలు పెరుగుతాయని భావించి క్లోజ్ అయింది. ఇక సాయికృష్ణ అవసరానికి వచ్చిన అమ్మాయిని అవకాశంగా మార్చుకొన్నాడు.
ఆమె వేధించింది అంటూ సాయి కృష్ణ తండ్రి, భార్య మాట్లాడుతున్నారు కానీ పరాయి స్త్రీ వైపు సాయికృష్ణ ఎందుకు వెళ్ళాడు అని మాట్లాడకపోవడం దురదృష్టకరం అంటూ కృష్ణ కుమారి తెలిపారు. నేటి సమాజంలో కష్టపడి ఏదైనా పనిచేసుకుని బ్రతకవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ అనే ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్లాలని అనుకునే వాళ్ళు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఆ రంగలోకి వెళ్లే ఆడపిలలను ఎలా చూస్తారు వంటివి తెలుసుకుని జాగ్రత పడితే బాగుంటుంది అంటూ చెప్పారు. అప్సర తల్లి ఆమెను కేవలం డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే చూడటం మరింత బాధాకరం అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…