Jabardasth Hari : ఒకరికి బదులుగా పేరు ఒక్కటవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో బలవ్వుతూంటారు. ముఖ్యంగా సినిమా టీవీ రంగంలో ఉన్న సెలబ్రిటీలు తాము చేయని తప్పుకు కొన్ని సార్లు డీఫేమ్ అవుతుంటారు. అలా ఇప్పుడు ఒక బుల్లితెర సెలబ్రిటీ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. జబర్దస్త్ లో లేడీ గేటప్ ద్వారా బాగా ఫేమస్ అయినా హరి తాజాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వేయడంతో ఇబ్బందులను ఎదుర్కోంటున్నాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను ఆశ్రయించి తాను ఎటువంటి నేరాలకు పాల్పడలేదని వివరణ ఇచ్చాడు.
ఆ హరి నేను కాదు…
జబర్దస్త్ లో లేడీ గెటప్ వేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ హరి బాబు. హరిత హారికగా బాగా ఫేమ్ సంపాదించిన ఇతను ఈ మధ్య కాలంలో తన పేరుతో వేరెవరో చేసిన క్రైమ్ కి బలయ్యాడు. వైఎస్ హరి అనే వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరకగా ఆ హరి ఈ జబర్దస్త్ హరినే ఏంటి అంటూ చాలా మీడియా ఛానెల్స్ హరి ఫోటో పెట్టి కథనాలు రాయడం వల్ల తనకు తన మిత్రులు ఈవెంట్ మేనేజర్స్ అలాగే కుటుంబ సభ్యుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు హరి.
ఆ హరి మొదట్లో జబర్దస్త్ లో శకలక శంకర్ టీంలో వెనుక ఉండే కమెడియన్స్ లో ఒకడిగా చేసాడు. అయితే ఆ హరి మళ్ళీ జబర్దస్త్ లో చేయలేదు. అతని ఫోటోని పెట్టి నేను లేడీ గెటప్ లో ఉన్న ఫోటో పెట్టి చాలా మీడియా ఛానెల్స్ వార్తలను ప్రసారం చేసాయి. నిజాలను క్లియర్ గా తెలుసుకోకుండా ఇలా వార్తలను ప్రచూరించే వారి మీద కేసు వేయాలనుకుంటున్నట్లు హరి తెలిపారు. తనకు ఈ ఇష్యూ వల్ల ఇప్పటికే 1500 ఫోన్ కాల్స్ వచ్చాయని ఇప్పుడు కూడా తన ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ తాను వాడుతున్నట్లు తన ఇబ్బందుల గురించి వివరిచాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…