Analyst Damu Balaji : అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక వెంకటేశ్వర కాలనీలోని దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసేవరకు పరిస్థితులు వెళ్లాయి. అయితే ఈ కేసులో సాయి కృష్ణ తండ్రి యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కొడుకును వెనకేసుకొచ్చారు. అయితే తాజాగా యూట్యూబ్ ఛానెల్స్ మీద విరుచుకుపడ్డారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
మీడియా మీద కేసు పెడతా…
సాయి కృష్ణ తండ్రి మూర్తి గారు కొడుకు పోలీసులకు హత్య తానే చేసినట్లు నేరం అంగీకరించినా కూడా కొడుకు మంచి వాడంటూ చెప్పుకొచ్చారు. నా కొడుకు అందగాడు అందుకే ఆ అమ్మాయి వెంటపడింది అంటూ ఇంటర్వ్యూలలో మాట్లాడారు. అయితే ఆయన న్యాయవాధులను సంప్రందించక ముందే ఇంటర్వ్యూలలో మాట్లాడినట్లు అనిపిస్తోందని అందుకే నా కొడుకు తప్పు చేసి ఉంటే ఎన్కౌంటర్ చేయండి అంటూ మాట్లాడరని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మీడియా ఛానెల్స్ అన్నీ సాయి కృష్ణ వైపు తప్పులను చూపించడం, మొదట్లో వచ్చిన విషయాల ప్రకారం అప్సర గర్భవతి అవడంతో సాయి కృష్ణ అబార్షన్ చేయించాడని ప్రచారం జరగడం గురించి మూర్తి గారు ఫైర్ అయ్యారు. పూర్తిగా విషయాలను తెలుసుకోకుండా మీడియా నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతోందని, పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆమె గర్భవతి కాదని తేలింది, మీడియా మీద కేసులు వేస్తా అంటూ ఫైర్ అయ్యారని బాలాజీ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…