Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమాత్రం పురోగతి కనిపించకపోయినా కేవలం రాజకీయంగా మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలకు పనికొస్తోంది. ఒకవైపు సునీత రెడ్డిని అడ్డం పెట్టుకుని టీడీపీ వివేకానంద రెడ్డి కేసును వాడుకుంటోందసని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే మరోవైపు జగన్ సొంత బాబాయ్ ని హత్య చేయించాడు అంటూ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఎపుడు తెలుస్తాయో తెలియదు కానీ ఎవరికి వారు కోర్టులను, సిబిఐ వంటి వ్యవస్థలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. సిబిఐ అధికారుల విచారణను కొంతమంది తప్పు పడుతుంటే ప్రభుత్వంకి అనుకూలంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల విమర్శల నడుమ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత రెడ్డి గారు ఈ కేసు విషయమై సుప్రీం తలుపు తట్టారు. ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.
సుప్రీం కోర్టుకెళ్ళిన సునీత…
మొదటి నుండి వివేకానంద హత్య కేసులో సునీత ఎక్కువగా కలిపించుకుంటోందని సిబిఐ కి మార్పించడం, ఏపీ హై కోర్టు నుండి కేసును తెలంగాణ హై కోర్టు కి మార్పించుకోవడం, ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్లడం వరకు ఆమె సిబిఐ మీద ఆధారపడకుండా వ్యవహరిస్తోందని బాలాజీ తెలిపారు. తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం మీద ఆమె సుప్రీం కోర్ట్ లో సవాలు చేసింది.
ఇందులో సిబిఐ ని కూడా ఇన్వాల్వ్ చేయాలని పిటిషన్ వేయగా సిబిఐ కావాలంటే సుప్రీంకి వస్తుంది పిటిషన్ వేసి మేమెందుకు సిబిఐ ని అడగాలని సుప్రీం కోర్టు లో సునీత ను ప్రశ్నించినట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. మొదటి నుండి వివేకానంద హత్య కేసులో సునీత రెడ్డి అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేస్తోందంటూ తెలిపారు. ఆమెకు టీడీపీ వైపు నుండి కోర్టు కోసం ఖర్చు పెడుతున్న డబ్బు అందుతోందని చంద్రబాబు, ఎంపీ రఘు రామ కృష్ణ రాజు ఆమె కు సపోర్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…