Movie News

Rajamouli: మొదటిసారి కమర్షియల్ యాడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి… వైరల్ అవుతున్న వీడియో?

Rajamouli: దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి పేరు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయనకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయనుకున్నటువంటి ఈ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని ప్రముఖ కంపెనీలు చూస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన కూడా పలు కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇప్పటివరకు పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన రాజమౌళి మొదటిసారి ఒక కమర్షియల్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోలో రాజమౌళి సూట్ వేసి అదరగొట్టేశాడు. స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ హంగామా చేశారు. ఐతే ఇది ఒప్పో కంపెనీ ఫోన్ కోసం యాడ్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా ఒప్పో కంపెనీ ఫోన్ కోసం రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఈ మొబైల్ ఫోన్ ను ప్రమోట్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.

Rajamouli: మొబైల్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్ గా జక్కన్న..


ఈ వీడియోలో రాజమౌళి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో హీరోలకు ఏమాత్రం తీసుపోరు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడంతో ఈయన పేరు మారుమోగిపోతుంది. అయితే ఈయన ఈ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago