Hero Venu: హీరో వేణుకి బెడిసి కొట్టిన రీ ఎంట్రీ.. సొంత డబ్బింగ్ అతని కొంపముంచిందా.. మరి ఈ హీరో పరిస్థితి ఏంటో?

Hero Venu: స్వయంవరం సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు అనంతరం పలు సినిమాలలో నటిస్తూ హీరోగా బిజీ అయ్యారు. అయితే ఈయన చివరిసారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమాలో నటించారు. ఈ సినిమా అనంతరం ఇండస్ట్రీకి దూరమైన వేణు తిరిగి రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమాలో వేణు ఒక పోలీసు ఆఫీసర్ పాత్ర ద్వారా సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. తద్వారా హీరో వేణు రీ ఎంట్రీ కి కూడా పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో వేణు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి గల కారణం గురించి కూడా నేటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేణు ఇప్పటివరకు తాను ఒక సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పలేదని తన సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పే వాళ్ళు అంటూ వెల్లడించారు.అయితే మొదటిసారి ఈ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పుకున్నానని చెప్పడం వల్ల అందరికీ సినిమాలలో వినిపించే వాయిస్ వేణుది కాదని క్లారిటీ వచ్చింది.

Hero Venu: తన వాయిస్ తనకు మైనస్ అయిందా…

ఇకపోతే ఈ సినిమాలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో ప్రేక్షకులు అతని వాయిస్ తనకు సెట్ కాలేదని ఇదే తనకు మైనస్ అయింది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏ హీరో అయినా మొదటి సినిమా లేదా రీ ఎంట్రీ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే వేణు మాత్రం తన రీ ఎంట్రీ సినిమా కూడా హిట్ కాకపోవడంతో మరి ఈయన పరిస్థితి ఏంటి అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.