Hero Venu: స్వయంవరం సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు అనంతరం పలు సినిమాలలో నటిస్తూ హీరోగా బిజీ అయ్యారు. అయితే ఈయన చివరిసారిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము సినిమాలో నటించారు. ఈ సినిమా అనంతరం ఇండస్ట్రీకి దూరమైన వేణు తిరిగి రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే ఈ సినిమాలో వేణు ఒక పోలీసు ఆఫీసర్ పాత్ర ద్వారా సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. తద్వారా హీరో వేణు రీ ఎంట్రీ కి కూడా పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో వేణు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి గల కారణం గురించి కూడా నేటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేణు ఇప్పటివరకు తాను ఒక సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పలేదని తన సినిమాలకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పే వాళ్ళు అంటూ వెల్లడించారు.అయితే మొదటిసారి ఈ సినిమాకి తానే డబ్బింగ్ చెప్పుకున్నానని చెప్పడం వల్ల అందరికీ సినిమాలలో వినిపించే వాయిస్ వేణుది కాదని క్లారిటీ వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో ప్రేక్షకులు అతని వాయిస్ తనకు సెట్ కాలేదని ఇదే తనకు మైనస్ అయింది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏ హీరో అయినా మొదటి సినిమా లేదా రీ ఎంట్రీ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే వేణు మాత్రం తన రీ ఎంట్రీ సినిమా కూడా హిట్ కాకపోవడంతో మరి ఈయన పరిస్థితి ఏంటి అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…