Pavithra Lokesh: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.నటుడు నరేష్ తో ఈమె సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలిచారు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఎన్నో తెలుగు సినిమాలలో హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నరేష్ తో వ్యవహారం బయటపడటంతో పెద్ద ఎత్తున ఈమె గురించి నెగెటివిటీ ఏర్పడింది.
పవిత్ర లోకేష్, నరేష్ తో కలిసి పలు సినిమాలలో జోడిగా నటించారు. ఈ క్రమంలోనే నరేష్ తో ఈమె వ్యవహారం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు రావడంతో నరేష్ భార్య రమ్య రఘుపతి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున నరేష్ పవిత్ర గురించి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా వీరిపై చెప్పుతో దాడి చేయడానికి కూడా ఆమె వెనకాడలేదు.
ఈ విధంగా పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకోవడంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోతాయని ఈ ప్రభావం తన కెరియర్ పై పడుతుందని చాలామంది భావించారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పవిత్ర లోకేష్ ఏకంగా తన రెమ్యూనరేషన్ పెంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఉన్నఫలంగా ఈమె రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు పవిత్ర లోకేష్ ఒక్క రోజుకు 60 వేల రూపాయల పారితోషకం తీసుకునేవారు. అయితే తాజాగా ఈమె లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్క కాల్ షీట్ కు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తమని చెప్పాలి. ఇలా ఒక్కసారిగా ఈమె రెమ్యూనరేషన్ పెంచేసే అందరినీ షాక్ కి గురి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…