Featured

Priyamani: కొత్త కారు కొన్న ప్రియమణి.. కారు ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Priyamani: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతోనూ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె నటించిన ఆర్టికల్ 370 అలాగే భామ కలాపం 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ విధంగా వరుస సక్సెస్ అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నటువంటి ఈమె తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు.అయితే ఇప్పటికే ప్రియమణి గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈమె కొనుగోలు చేసిన కారు ఏది,దాని ధర ఎంత అనే విషయానికి వస్తే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ని  కొనుగోలు చేసింది ప్రియమణి. ఈ కారు ధర దాదాపు 74 లక్షల వరకు ఉంది. ఇలా ఈమె మరో ఖరీదైన కారును తన గ్యారేజ్ లోకి చేర్చారు.

Advertisement

మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ..

ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ప్రియమణి ప్రస్తుతం మాత్రం పలు కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ మదర్ క్యారెక్టర్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ప్రియమణి ఒకానొక సమయంలో బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో ఈమె బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Trending

Exit mobile version