హీరోయిన్లు చూపిస్తే తప్పు లేదు.. కానీ మేము చేస్తే తప్పొచ్చిందా..

రమ్య శ్రీ ఒక నటిగా..మోడల్ గా పనిచేసింది. రమ్య శ్రీ ఒక భారతీయ చలనచిత్ర నటి, దర్శకురాలు కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసింది. రమ్య ‘ఓ మల్లి’, ‘ప్రేమ రాజ్యం’ వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేసింది. ఇటీవల ఆమె నటించిన సినిమా ఓ మల్లి.. 2016 లో విడుదలైంది. అయితే ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఒక అసభ్యకరమైన క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు మీకు ఏమైనా పెయిన్ గా అనిపిస్తుందా అని ప్రశ్నించినప్పుడు.. ఆమె ఇలా సమాధానం చెప్పారు. అవును అనిపిస్తుంది.. సమంత రంగస్థలంలో పిరుదుల కనిపించే అంతగా నటించింది.. అంతే కాకుండా ఆమె ఎన్నో సినిమాల్లో ఇలానే నటించింది. ఆమె తన క్యారెక్టర్ కు తగ్గట్టు నటించింది కానీ.. నిజంగా అలా కాదు కదా.. అంటూ ఆమె చెప్పింది. తాను కూడా ఆ పాత్రను తాను న్యాయం చేశామా.. లేదా అనేది చూస్తానని చెప్పింది.

అలా అని ఇదొక్క క్యారెక్టరే చేస్తా అని ఉండనని.. మిగతావి కూడా చేస్తానని అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి కూడా మారిపోయిందంటూ చెప్పారు. గ్లామర్ గా కనిపిస్తేనే హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారు.. అప్పట్లో అలా ఉండేది కాదంటూ చెప్పారు. సినిమా చూసే వాళ్లు ఎక్కువగా ఇన్ వాల్వు కావడం వల్ల వాళ్లకు అలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయని .. అందుకే బయట తాను కనిపించినప్పుడు వాళ్లకు తమపై అలాంటి ఫీలింగ్ వచ్చేసి.. ఈమె ఫలానా అంటూ అనుకుంటారని చెప్పారు.

కానీ అది నిజం కాదు. కేవలం కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటాం.. కానీ.. బయట అలా ఉండదు.. ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్ గాని, ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కానీ.. ఏదైనా మిస్టేక్ గానీ తన జీవితంలో రాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి క్యారెక్టర్లు చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కాస్తంగా బాధపడ్డట్లు తెలిపారు. ఈమె క్యారెక్టర్ ఇలా అంటూ వాళ్లు..వీళ్లు అంటుంటే.. కొంచెం బాధేసేది.. కానీ అలా ఉండేదాన్ని కాదు అంటూ చెప్పింది. బయట ఎలాంటి చెడు అలావాట్లు లేవంటూ చెప్పుకొచ్చాడు. ఒక ఇల్లాలు ఎలా ఉంటుందో.. అలా ఉంటానని ఈ సందర్భంగా రమ్య శ్రీ చెప్పారు.