సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేశ్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబుగా పేరొందిన ఇతడు విభిన్నమైన క్యారెక్టర్లతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. పోకిరీ సినిమాతో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి తనకుంటూ మంచి ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు మహేశ్. అయితే మహేశ్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.
ఇదిలా ఉండగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రిన్స్ మహేశ్ బాబు ఆయా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేశ్ ఎంతో గ్లామర్ గా కనపడుతుంటాడని టాక్.
యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
దీనిలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ ఇంటి కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…