ద్విచక్ర వాహనదారులు అలర్ట్.. సౌండ్ చేశారో సీజ్ అయిపోతది..!

హైదరాబాద్ సిటీలో కొంతమంది ఆకతాయిలు సరదా కోసం సౌండ్ పొల్యూషన్ ను స్పష్టిస్తుంటారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన సైలెన్సర్ తీసేసి.. సౌండ్ ఎక్కువగా వచ్చే మరో సైలెన్సర్ ను అమర్చుతుంటారు. ఇలా వాళ్లు ఆ వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ తమ వైపే చూడాలనే ఆశ వాళ్లకు ఉంటుంది.

దీంతో ఆ సౌండ్ కారణంగా మహిళలు, చిన్న పిల్లలు. వృద్దులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్లు అయితే.. ఇంకా ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి భరతం పట్టేందుకు సిటీ పోలీసులు చాలా వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. అప్పుడు కొంతమంది దొరికారు.. కానీ ఇంకా అటువంటి చర్యలకు పాల్పడే వారు ఉన్నారు.

ఇటువంటి బండ్లు ఉంటే ఇక నుంచి వాటిని సీజ్ చేస్తామని.. కొన్ని బండ్లను సీజ్ చేసినట్లు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. దీనిపై వాహనదారులకు కేబీఆర్ పార్క్ వద్ద అవగాహన కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో సైలెన్సర్లు మళ్లీ పనికి రాకుండా రోడ్ రోలర్ తో తొక్కించారు.

ఇలా పట్టుబడిన బండ్లు ఎక్కువగా బుల్లెట్ బండ్లు, స్పోర్ట్ బండ్లే ఉన్నాయన్నారు. ఇలా నగరవాసులకు, పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఈ సౌండ్ పొల్యుషన్ కు పాల్పడుతున్న వ్యక్తి మొదటి సారి పట్టుబడితే రూ.వెయ్యి పైన్, రెండో సారి అయితే రూ.2 వేలు, మూడో సారి అయితే వెహికిల్ సీజ్ చేస్తామన్నారు. మెకానిక్ లు ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని కోరారు.