Hyper Aadi: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బెదిరింపులకు పాల్పడిన హైపర్ ఆది?

Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులందరికీ మెప్పించారు. ఈయన మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పిఠాపురంలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.

ఇక పవన్ కళ్యాణ్ ని గెలవడంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ ఆది భారీగా ఉపయోగించుకుంటున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో డాన్స్ మాస్టర్‌ పండు అండ్ టీమ్‌ ఆదితో కలిసి ఓ స్కిట్‌ ప్రదర్శించారు.

పిఠాపురం గుర్తుందా.
ఈ స్కిట్ లో భాగంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పండు మాస్టర్ నువ్వు ఎంత చెప్పినా ఈ రోజు తగ్గేదెలే అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్‌ ఆదిని బెదిరించాడు . దీంతో హైపర్ ఆది రియాక్ట్ అవుతూ రేయ్ మనం ఎవరి తాలూకాలో తెలుసు కదా..నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్‌ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్‌ ఆది. దీంతో ఇది హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి షోలోనూ పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి, పిఠాపురం పేరు చెప్పి బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్‌ అవుతుంది.