Featured

Upasana: పెళ్లి కాగానే మరో ప్రపంచానికి వచ్చినట్టు అయింది.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Published

on

Upasana: ఉపాసన పరిచయం అవసరం లేని పేరు మెగా ఇంటికోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా అందరికీ ఎంతో సుపరిచితమే ఇలా ఈమె బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ఈమె ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉన్నట్లు ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక పురుషుడు ఉండాలని ఈమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ కుటుంబం మా కుటుంబం చాలా భిన్నమైనటువంటి కుటుంబాలు నేను రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చాను అన్న భావన కలిగిందని తెలిపారు.

ఇప్పుడు చరణ్ కు నీడలా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ ఉపాసన తెలియజేశారు. మేమిద్దరం పరస్పరం ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటామని, బిడ్డలను కనాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నామని ఈమె తెలియజేశారు.

Advertisement

చరణ్ కు నీడలా..
మా అమ్మ వాళ్ళను మా తాతయ్య చాలా ఆత్మవిశ్వాసంతో పెంచారు. వాళ్లు కూడా ఆయన కలలకు అనుగుణంగానే నడుచుకున్నారు. ఇలా మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో కీలకపాత్ర పోషించారని, నేను స్త్రీ ప్రపంచం అని భావించే ఒక వాతావరణంలో పుట్టాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Trending

Exit mobile version