Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత

Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత

Samantha: నాగ చైతన్యతో విడిపోయాక సమంత బిజీగా మారుతోంది. నాగ చైతన్య- సమంత విడిపోవడం వాళ్ల ఫ్యాన్స్ కే కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని క్యూట్ కపుల్ గా ఉన్న వాళ్లు మనస్పర్థలతో విడిపోయారు. అయితే విడాకుల అనంతరం సమంత చాలా సార్లు భావోద్వేగాలతో పోస్ట్ లు చేసింది.

Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత
Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత

ఓ సమయంలో మరణించాలన్న ఆలోచనలు కూడా వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ సంఘటన నుంచి సమంత ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయింది.  తాజాగా తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రెషన్ల కోసం గోవాకు కూడా వెళ్లింది. సమయం దొరికినప్పుడల్లా టూర్లకు వెళుతోంది.

Samantha: ఆ ఫీల్ పొందడానికి నేను రెడీ.. నువ్వు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయి: సమంత

సోషల్ మీడియాలో ఎప్పుడూ… యాక్టివ్ గా ఉండే సమంత తన ఇష్టాలను, అనుభవాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఇటీవల గోవాకు వెళ్లిన ఫోటోలను తను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ అయిన రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లతో దిగిన ఫోటోలను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మీరు లేకుండా నేను ఏం చేయగలను’’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. 


ఓకే విశ్వమా అంటూ…

తాజాగా మరో ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. అయితే ఈసారి నేచర్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో షేర్ చేసి తన అభిప్రాయాలను పంచుకుంది.” ఓకే విశ్వమా.. నేను గుడ్ థింగ్స్ ను ఫీల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను.. నువ్వు కూడా గుడ్ థింగ్స్ ను ఫీల్ అయ్యేలా చేయి” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరోవైపు సినిమాలతో సమంత బిజీ అయింది. ఇటీవల పుష్ప సినిమాలో చేసిన ‘‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’’ సాంగ్ చేసింది. ఈ ఐటెం సాంగ్ పెద్ద హిట్ అయింది. ప్యాన్ ఇండియా మూవీ ‘ శాకుంతలం’ లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ‘యశోద’ సినిమాలో కూడా నటిస్తోంది.