Imandhi Ramarao : చిరంజీవి పై గరికపాటి ఆగ్రహం… నాగబాబు అత్యుత్సాహం… వారికీ కోపం తెప్పించింది అతనే : ఇమంది రామారావు

Imandhi Ramarao : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహించారు. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఆయన కనిపించగానే ఒక్కసారి ఫోటో దిగాలని ఎవరికి ఉండదు, అలా ఆయనతో సెల్ఫీ లు తీసుకుంటుండగా అదే సమయంలో ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోలు దిగడజం ఆపేసి ఆయనకు శిరసు వంచి నమస్కారం చేశారు. ఇక ఈ ఇష్యూ మీద నాగబాబు గారు గరికపాటి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మొత్తం ఇష్యూ లో అసలు తప్పెవరిది అన్న అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఎక్కడ నెగ్గాల్లో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు…

ఇమంది గారు మాట్లాడుతూ చిరంజీవి గారికంటే వయసులో చిన్నవడైనా గరికపాటి నరసింహారావు గారు అలా మైక్ లో అసహనాన్ని వ్యక్తం చేయడం తప్పు. అయితే ఇక్కడ చిరంజీవి గారు చాలా హుందాగా వ్యవహారించారు. డిప్లొమసీ ముందు పుట్టి చిరంజీవి ఆ తరువాత పుట్టారు అన్నట్లుగా ఆయన శైలి ఉంటుంది. ఎవరినీ అంత త్వరగా నొప్పించేలా మాట్లాడరు. ఆ వేడుకలో కూడా ఫోటోషూట్ ఆయన తప్పు కాదు ఆ వేడుకను కో ఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి.

ఇక ప్రవచనాలు చెబుతున్న గరికపాటి గారు చిరు తో సెల్ఫీలు తీసుకుంటున్న వారి పై అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారిని మీరు ఫోటోలు తీసుకోవడం ఆపితే నేను ప్రవచనాలు మొదలు పెడతాను లేదంటే నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పడం చిరంజీవి గారి అభిమానులకు కోపం తెప్పించింది. అయితే అంతా సర్దుకుంది అనే సమయానికి మెగా బ్రదర్ నాగబాబు గారు మా అన్నయ్య గారి ఇమేజ్ ముందు ఈ గరికపాటి ఏ పాటి అంటూ అనడం తో ఈ వివాదం మరింత ముదిరింది. ఇక ఈ ఇష్యూ లో గరికపాటి గారికి మద్ధతిస్తూ కొంతమంది మెగాస్టార్ ను ట్రోల్ చేస్తున్నారు. చిరు గారు గరికపాటి గారిని అక్కడ స్టేజి మీదే ఏమి అనకుండా నాగబాబు తో అనిపించారు అనే వాదన మొదలయింది. ఇక వీటిపై ఇమంది గారు మాట్లాడుతూ చిరంజీవి గారు స్వతహాగా వివాదాల జోలికి వెళ్లరు. ఇది పూర్తిగా నాగబాబు గారి మూర్కత్వం, సద్ధుమనిగిన వివాదాన్ని మళ్ళీ లేవనెత్తారు, గరికపాటి గారు అయన రంగంలో ఉద్ధండులే అలాంటి వారిని నువ్వు ఏ పాటి అంటూ కించపరచడం తప్పు అంటూ వాఖ్యణించారు.