Prabhas Seenu : ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ఇక సినిమాల్లో వచ్చిన మొదట్లోనే యాక్టింగ్ వైపు కాకుండా ప్రభాస్ కి కేర్ టేకర్ గా ఉండేవారు శీను.
నన్ను ప్రభాస్ భరిస్తున్నాడు…
సినిమాల్లోకి రావాల్ని అనుకున్నపుడే ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ కోర్స్ చేసిన శీను ఆ తరువాత సత్యానంద గారి వద్ద శిక్షణ తీసుకోడానికి ఆయన దగ్గర చేరితే అపుడు హీరో ప్రభాస్ పరిచయమై అలా ఆ పరిచయంతో ప్రభాస్ కి కేర్ టేకర్ గా తనతోనే ఉండేవాడు. ఇక అలా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రభాస్ తో వచ్చిన శీను ప్రభాస్ శీను అయ్యాడు. అయితే సినిమాల్లో అవకాశాలు వస్తే నువ్వు చేసుకో నాతోనే ఉండాల్సిన పని లేదు అని ప్రభాస్ గారు చెప్పారట. ప్రభాస్ గారితో ఉండడం వల్ల శీను కి పరిచయాలు పెరగడం వల్ల అవకాశాలు కూడా వచ్చాయి. ఇక ప్రభాస్ మూడ్ ని బట్టి ఆయనతో ఉంటాను అంటూ చెప్పారు ప్రభాస్ శీను.
అయితే ప్రభాస్ తో ఉండటం వల్ల ఆయన పేరెంట్స్ తోనూ అలానే కృష్ణం రాజు గారు అయన కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పారు. కృష్ణం రాజు గారు నన్ను మంత్రి అంటుండేవారు అంటూ ప్రాబఙస్ శీను తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక నాలాంటి తింగరోడ్ని భరిస్తున్నాడంటే అది ప్రభాస్ గొప్పతనం, నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన ఓపికగా భరిస్తాడు. నా తప్పులను ఆయన విసుక్కుంటే ఇప్పటికి ఎన్ని సార్లు నన్ను కొట్టేవాడో, మా బంధం ఇన్నేళ్లు సాగదు అంటూ ప్రభాస్ శీను ప్రభాస్ గురించి చెబూతు ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…