Anchor Anasuya: బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం అదే పాపులారిటీతో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.
ప్రస్తుతం అనసూయ వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఇలా అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనసూయకు ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే అనసూయను ప్రశ్నిస్తూ ఎన్నిసార్లు నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి. ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా అనసూయకు నేటిజన్ నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ కి గురైంది.
ఈ క్రమంలోనే నేటిజన్ కి రిప్లై ఇస్తూ..మౌనంగా ఉన్నటువంటి ఎమోజీని షేర్ చేయడమే కాకుండా తను ఆలోచనలో ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ రెండో పెళ్లి గురించి అనసూయ ఆలోచనలో పడ్డారా…ఈ పోస్ట్ కు అదే అర్థమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అనసూయ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…