Imandhi Ramarao : బాలకృష్ణ ని అలా చూపించి షో పరువు తీస్తారా…శర్వానంద్, అడవి శేష్ తో ఇలాంటి కంటెంట్ ప్లాన్ చేస్తారా…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Imandhi Ramarao : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టోపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. షో కోసం చాలా మంది ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారు. రేటింగ్స్ లో దుమ్ములేపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లో ఈ షో కి వచ్చి కనువిందు చేసారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో యూత్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. యూత్ స్టార్స్ తో కుడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా వారికి సమానంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. దెబ్బకి థింకింగ్ మారిపోవాలా అంటు బాలయ్య చెప్పే డైలాగు లాగే బాలయ్య మీద ఉన్న ప్రేక్షకుల అభిప్రాయంను ఈ షో మార్చేసింది. ఇక అన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టుగా అన్ స్టోపబుల్ గా సాగుతోంది. ఇక మూడో ఎపిసోడ్ కి గెస్టులు గా యంగ్ హీరోస్ శర్వానంద్, అడవి శేష్ ఇద్దరు వచ్చారు.

బాలయ్య తో బూతులు మాట్లాడిస్తారా….

అన్ స్టాపబుల్ షో మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఆల్రెడీ ఈ ప్రోమో యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా ఉంది కూడా. అయితే ఈ షో లో రివ్యూ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ ఇమాందో రామారావు గారు. మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో బాలకృష్ణ మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందంటూ చెప్పారు. బాలయ్య లాంటోడితో అలా బూతులు మాట్లాడించడమేంటి అంటూ విమర్శించారు.

ఇక షో కి విచ్చేసిన వాళ్ళు కుర్ర హీరోలు శర్వానంద్, అడవి శేష్. వీళ్ళిద్దరు తో బాలయ్య అడిగిన ప్రశ్నలు అన్ని కొంచెం బూతులు మాట్లాడినట్టుగా ఉందంటూ అభిప్రాయపడ్డారు. అధికాక బాలయ్య మేకప్ కూడా బాగోలేదు. ఆయన బాగా అలసిపోయినట్లుగా మొహాం లో అనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నా ఉత్సాహం ఆయనలో కనిపించలేదు. మేకర్స్ వీటిపై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ మాట్లాడారు.