Categories: FeaturedMovie News

Hero Suman : శోభన్ బాబు గారి కూతురితో పరిచయం ఉన్నా ఆ విషయంలో ఆయన్ని అడగలేదు…ఆరు నెలలు జైల్లో మగ్గినపుడు ఏ హీరో నాకు సహాయం చేయలేదు…: హీరో సుమన్

Hero Suman : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు.తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీ లో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీ లోకి కుడా అడుగుపెట్టారు. తెలుగులో మొదట ఇద్దరు ఖిలడీలు సినిమాతో మొదలు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి సితార సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శోభన బాబు, కృష్ణం రాజు వంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సుమన్ గారు ఆయన నటనకు నంది అవార్డు కుడా అందుకున్నారు.

జైల్లో ఉన్నపుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు…..

సుమన్ కెరీర్ పీక్స్ లో ఉండి తెలుగులో సూపర్ హిట్స్ అలాగే తమిళం లోను బాగా బిజీగా ఉన్న సమయంలో ఆయన మీద నీలే చిత్రాల్లో నటించాడు అన్న మచ్చ పడింది. ఇక రాత్రికి రాత్రే ఆయనను అరెస్ట్ కుడా చేసారు ప్రాస్టిట్యూషన్ కేసులో. ఆ సమయంలో ఇండస్ట్రీ నుండి ఎవరు సుమన్ కి సహాయం చేయలేదు. ఒక బిజీగా ఉన్న హీరో అలాంటి పనిచేయాల్సిన పని లేదని చెప్పినా వినిపించుకోలేదు. తమిళం నుండి సుమలత, సుహాసిని వంటి హీరోయిన్స్ మాత్రం పత్రిక ముఖంగా సుమన్ అలాంటివాడు కాదని చాలా డిసెంట్ గా సెట్స్ లో ఉంటారంటు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తెలుగు పత్రికలు సుమన్ గురించి తమిళ పత్రికల కథనలను వేస్తూ సుమన అలాంటివాడు కాదు అంటూ చైతన్యపరిచయట. అయిన ఆరు నెలలు జైల్లో మగ్గిన సుమన్ కు ఆ సమయంలో తన తో సమకాలికులుగా ఉన్నా ఏ హీరోలు సహాయం చేయలేదని చెప్పారు.

కేవలం తెలుగు మీడియా నా గురించి మంచిగా కథనాలు రాసి జనంలో నన్ను నిలబెట్టారని చెప్పారు. ఇక తమిళం లో కుముదం అనే మ్యాగ్జైన్ లో కొంతమంది నాకు సపోర్ట్ గా మాట్లాడిన ఇంటర్వ్యూ మాత్రమే ఆ సమయంలో నాకు లభించిన మద్దతు అంటూ చెప్పారు. ఇక అవాకాశాల కోసం కానీ ఏదైనా సహాయం కోసం కానీ పరిచయాలను వాడుకోలేదా అనే ప్రశ్నకు శోభన్ బాబు గారి కూతురు మా అమ్మ దగ్గర చదువుకుంది. మృధుల గారు ఆయన కూతురు అని తెలిసిన ఆయన నేను కలిసి సినిమాలో చేసినపుడు ఆ విషయం చెప్పి చనువు పెంచుకోవాలనే ఆలోచన చేయలేదు. ఇక కృష్ణం రాజు గారు చాలా మంచి మనిషి నన్ను తన సోదరుడిలా చూస్తారు కానీ ఆ పరిచయం ఉపయోగించుకోలేదు. కృష్ణ గారి కూతురు కుడా అమ్మ పనిచేసే కాలేజీ లోనే చదువుకునేవారు అయినా నేను పరిచయాలను ఉపయోగించుకోలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago