L. B. Sriram : కమెడియన్ గా అందరికి బాగా తెలిసిన ఎల్బి శ్రీరామ్ గారు మంచి హాస్యనటుడే కాదు గొప్ప రైటర్ కూడా. ఆయన డైలాగు రైటర్ గా సినిమాలకు పనిచేసారు. విభిన్న మైన డైలాగు డెలివరీతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఆయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బ్యానర్ మీద షార్ట్ ఫిలిమ్స్ ను తీస్తున్నారు. సినిమాల్లో ఇస్తున్న మూస పాత్రలను చేయడం ఇష్టం లేక వాటి నుండి తప్పుకున్నాను అంటూ శ్రీరామ్ చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ సినిమాల్లో అవకాశల కోసం కష్టపడిన ఎల్బి శ్రీరామ్ గారు ప్రస్తుతం కవి సామ్రాట్ అనే షార్ట్ ఫిల్మ్ ను ఆహా ఒరిజినల్స్ లో చేశారు. ఒక మూస పాత్రలతో ఇమడలేక చాలా సినిమాలను వదులుకున్న ఆయన ప్రస్తుతం రచయిత గా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
హలో బ్రదర్ తరువాత అవకాశాలు….
మొదటగా కోకిల, ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పారావు, హిట్లర్, హలో బ్రదర్ వంటి సినిమాలకు రైటర్ గా పనిచేసిన ఎల్బి శ్రీరామ్ గారు హలో బ్రదర్ వంటి సినిమా తరువాత పెద్ద సినిమా అవకాశాలను అందుకోలేదు. అధికాక ఈవివి గారి తో అప్పటివరకు పనిచేసిన ఆయన ఆ తరువాత ఆయనతో కలిసి పనిచేయలేదు. వారి మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా అనే విషయం మీద శ్రీరామ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈవివి గారితో కలిసి పనిచేసిన ఆయన హలో బ్రదర్ మంచి హిట్ తరువాత కుడా గ్రూప్ లో ఉన్నానట్టు చెబుతూ మా మధ్య ఇలాంటో విబేధాలు లేవు కానీ ఆయన పెద్ద డైరెక్టర్ ఆయన నిర్మాతల ఇష్టాలనతోనో లేక హీరోల అభిరుచుల మేరకో వేరే రచయితలను పెట్టుకుని ఉండవచ్చు.
అధికాక నేను కుడా నాకు పలానా సినిమాలో రాసే అవకాశం ఇవ్వమని అడగలేదు అలా జరిగిపోయింది. నేను ఇండస్ట్రీ కి వచేసిన మొదట్లో కష్టపడ్డపుడు అనుకున్నధానికంటే ఎక్కువ విజయాన్నే చూసాను. తినాలనుకున్న దానికంటే ఒక ముద్ద ఎక్కువే తిన్నాను ఆ సంతృప్తి ఉంది. ఇక నటుడుగా రచయితగా కుడా సక్సెస్ చూసాను. ఉండాల్సిన దానికంటే రెట్టింపు సంతోషంగా ఉన్నాను ఇంకా ఏమి కావాలి అందుకే ఏ రోజు నాకు పలానా వాళ్ళు అవాకాశం ఇవ్వలేదని బాధపడను అడగను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…