Imandi Ramarao : 4 వేల గజాలలో కేఆర్ విజయ ఇల్లు… హెలిపాడ్ సౌకర్యంతో… ఆ ఆస్తులన్నీ పోయి : ఇమంది రామారావు

Imandi Ramarao : ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన కేఆర్ విజయ అంతకు ముందే తమిళం, మలయాళం లో చాలా సినిమాలను చేసారు. ఇక దేవత రూపం అంటే కేఆర్ విజయ అనేంతలా ఆమె అభినయం ఆహార్యం రెండూ ఉండేవి. సినిమాల్లో అప్పట్లో అమ్మవారి రూపం అంటే కేఆర్ విజయనే అనేంతలా ఆమె నటన ఆకట్టుకుంది. నిజంగానే దేవత స్వరూపిణి అనుకుని ప్రేక్షకులు అనుకునే వారు. ఇక ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన విజయ గారు 1966 లో తెలుగు సినిమాలు మొదలుపెట్టి అందరు అగ్ర హీరోలతో నటించారు. ఇక మలయాళం, తమిళం, తెలుగు ఇలా అన్ని సౌత్ భాషలలో అందరు హీరోలతో నటించారు.

ఆస్తులు అన్నీ కరిగిపోయాయి…

సినిమాల్లో మంచి అవకాశాలతో దూసుకెళ్లిన కేఆర్ విజయ గారిది కేరళ అయినా పుట్టి పెరిగింది మాత్రం తమిళనాడు చెన్నై లో. ఇక హీరోయిన్ గా కెరీర్ బాగున్నపుడే చెన్నై లో ఆస్తులను బాగా చేసుకున్నారు. 4 వేల గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న విజయ అందులో మూడు నీటి కొలనులతో పాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా ఇంటి పైన హెలి పాడ్ ఆ రోజుల్లోనే ఉండేదట. ఇక కేఆర్ విజయ గార్డెన్స్ పేరుతో సుమారు 60ఎకరాలకు పైనే భూమిలో గార్డెన్ ఉండేది. అందులో షూటింగ్స్ కూడా జరిగేవి.

ఇక కార్తీక వనభోజనాల సమయంలో సినిమా ఇండస్ట్రీ లోని స్నేహితులకు అక్కడే భోజనాలను ఏర్పాటు చేసే వారట విజయ. అయితే అదంతా పూర్వ వైభవం అంటూ ఆమె ఆస్తులు సంపాదించడం, పోగొట్టుకోవడం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు చెప్పారు. అన్ని ఆస్తులు నమ్మిన కొందరి వల్ల మోసపోవడం వల్ల విజయ కోల్పోయి ప్రస్తుతం చిన్న ఫ్లాట్ లో ఉంటున్నారట. ఇక వాళ్లకు స్వంతంగా ఉన్న వ్యాపారాల్లో నష్టాల కారణంగా కూడా ఆమె ఆస్తులను కోల్పోయారు అంటూ తెలిపారు ఇమంది రామారావు.