Un Stoppable 2: బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారమైనటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ వారిని నుంచి ఎన్నో సమాధానాలను రాబట్టారు. ఇలా మొదటి సీజన్లో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ వేదికపై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమం మంచి విజయం అందుకోవడంతో ఈ కార్యక్రమానికి సీక్వెల్ గా సీజన్ 2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ సీజన్ 2 కి ఓ ప్రత్యేకత ఉంది.
మొదటి సీజన్లో కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించారు. కానీ రెండవ సీజన్లో మాత్రం రాజకీయ నాయకులని కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడు స్వయాన బాలకృష్ణకు బావ కావడంతో తనని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చే బాధ్యత బాలకృష్ణ తన భుజాలపై వేసుకున్నారని చంద్రబాబు నాయుడుని తనదైన శైలిలో ప్రశ్నించడానికి బాలకృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే మొదటిసారి రాజకీయ నాయకులను కూడా ఇలాంటి టాక్ షోలకు తీసుకువచ్చిన ఘనత ఆహా కి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.ఇకపోతే సీజన్ 2 లో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు ఒకే వేదికపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…