God Father: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాల సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు.
ఇక గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రధాన కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తన తండ్రికి లూసిఫర్ సినిమా చూడమని సలహా ఇచ్చింది రామ్ చరణ్ అని చిరంజీవి పేర్కొన్నారు.ఈ సినిమా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందని రామ్ చరణ్ లూసిఫర్ సినిమాను చూపించి చిరంజీవిని సినిమా చేయటానికి ఒప్పించారట.
ఇక ఈ సినిమాకి కొణిదెల ప్రొడక్షన్ తో పాటు సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరొక నిర్మాత ఎన్ వి ప్రసాద్ తో కలిసి మాట్లాడి అందరిని ఈ సినిమాకి ఒప్పించారట. అదేవిధంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్వయంగా రామ్ చరణ్ కలిసి తనని కూడా సినిమా కోసం ఒప్పించారని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్ తెర వెనుక ఉండి ముందుకు నడిపించారని తెలుస్తోంది. రామ్ చరణ్ లూసిఫర్ సినిమా కోసం అన్ని సమకూర్చి ఆయన తన సినిమా పనులతో బిజీగా ఉన్నారు.ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…