Ravi Kishan: మద్దాలి శివారెడ్డి ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కున రేసుగుర్రం విలన్ గుర్తుకొస్తారు. భోజ్ పూర్ నటుడిగాఎన్నో సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి కిషన్ బాలీవుడ్ సినిమాలలో కూడా హీరోగా నటించారు. అనంతరం ఈయన తెలుగులో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే మద్దాలి శివారెడ్డి పాత్రలో రేసుగుర్రం సినిమాలో తన అద్భుతమైన నటన కనబరిచిన రవి కిషన్ నిజజీవితంలో కూడా ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. గోరఖ్ పూర్ ఎంపీగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈయన ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కొనసాగుతున్నారు.
నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రవి కిషన్ ఒక వ్యాపారవేత్త చేతిలో దారుణంగా మోసపోయి ఏకంగా 3.25 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు తెలుస్తుంది. ఈయన ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తన స్నేహితుడు వ్యాపారవేత్త జితేంద్ర రమేష్ కు ఏకంగా 3.25కోట్ల రూపాయలు డబ్బుని ఇచ్చారట అయితే ఇప్పటివరకు తన డబ్బును తనకు తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది.
ఈ విషయంపై రవికిషన్ పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ జితేంద్ర తన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో రవి కిషన్ పిఆర్ఓ పవన్ దూబే ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా స్నేహితుడు వ్యాపారవేత అని నమ్మి ఈయన భారీ మొత్తంలో డబ్బు ఇవ్వగా డబ్బు మొత్తం నష్టపోయినట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…