కరోనా సోకకుండా ఉండాలంటే ఈ ఆహారం తినండి!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.అయితే ఎవరికైతే వారి శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందో అలాంటి వారు ఈ మహమ్మారి నుంచి బతికి బయట పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.అదే విధంగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని మెరుగు పరిచే ఆహార జాబితాను సిద్ధం చేశారు. మరి ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

తాజా కూరగాయలు అయినా టమోటా, క్యారెట్, బీట్ రూట్, వంకాయ, క్యాప్సికం, బ్రోకలీ, పాలకూర వంటి కూరగాయలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా తాజా బొప్పాయి, పైనాపిల్, కివి, ఆరెంజ్, బెర్రీస్, జామ వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభించి రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే కేవలం పండ్లు కూరగాయలు మాత్రమే కాకుండా రాత్రంతా నీటిలో నానబెట్టిన నట్స్, బాదం, వాల్నట్ వంటి వాటిని తీసుకోవాలి. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు ఎక్కువ గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ వంటి పానీయాలు సేవించాలి. ఈ రోజుల్లో ఎక్కువ ఆహార పదార్థాల కంటే రోజులో ఎక్కువ భాగం ద్రవాలు తీసుకోవడానికి ఇష్టపడాలి. ఈ విధంగా ప్రతిరోజు మన ఆహార నియమాలను పాటించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకుని ఎటువంటి వైరస్ ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.