తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ సాధించాడు ఇళయదళపతి విజయ్. ఐతే, విజయ్ దాదాపు పదేళ్ల నుండే సౌత్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు.కానీ, విజయ్ చేసిన ప్రయత్నాలలో ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడిప్పుడే అతనికి తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంది. అది గమనించిన ఈ హీరో ఆ మార్కెట్ కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
తెలుగులో మార్కెట్ పెరగాలి అంటే.. తెలుగు పై మరింత ఫోకస్ పెట్టాలి, అందుకే విజయ్ ప్రస్తుతం తెలుగు పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.తమిళ హీరోల్లో అందరికన్నా తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో ‘కార్తీ’నే. మొదట తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తెలుగులో ‘ఊపిరి’ అనే సినిమా చేశాడు. కేవలం ఆ సినిమా వల్ల కార్తీకి తెలుగులో మార్కెట్ మరింతగా పెరిగింది.
అప్పటికే తెలుగువారికి మరింతగా చేరువైన తన అన్నయ్య సూర్య కంటే కూడా, కార్తీ ‘ఊపిరి’తో తెలుగులో ఇంకా ఎక్కువ మార్కెట్ అలాగే స్టార్ ఇమేజ్ ను సాధించాడు.మొత్తానికి కార్తీనే ఫాలో అవ్వడానికి సిద్ధం అయ్యాడు విజయ్. తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ రావాలి అన్నా, అలాగే తెలుగులో కూడా తనకు స్టార్ ఇమేజ్ రావాలి అన్నా, తానూ కూడా కార్తీలాగే డైరెక్ట్ తెలుగు స్టార్ మేకర్స్ తో సినిమా చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడు.
అందులో భాగంగా ఇటీవల నిర్మాత దిల్ రాజుతో పర్సనల్ గా చర్చలు కూడా జరిపాడు. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.ఆ సినిమాకి సంబంధించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏమిటంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా సినిమా రాబోతుంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి, విజయ్ ను కలిసి కథ చెప్పాడు. విజయ్ కి కథ నచ్చిందని టాక్..ఇక తొందర్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని.. అంతేకాదు తెలుగు,తమిళ భాషల్లో బై లింగ్వల్ మూవీ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…