కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన సినిమా ‘KGF’.. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ ఒకే ఒక్క సినిమా కన్నడ హీరో యశ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.. అంతేకాదు ఈ సినిమా హిట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 రాబోతుంది.
దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ విజయం సాధించడంతో ఛాప్టర్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.అయితే ఇదివరకే గ్లింప్స్ తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైం కి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది..దీంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి..
ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.. ఈ సినిమా తోపాటు మరో వైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమాను కూడా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్… ఆసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది..ఇప్పటికే బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది..ఏప్రిల్ 14, 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…