Indhu Anand : తల్లిగా నేను చాలా బాధపడ్డాను.. దయచేసి మీ వ్యూస్ కోసం అలా చేయడం ఆపండి.. : ఇందు ఆనంద్

Indhu Anand : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోను చేసిన కొన్ని సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు. ఇక తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురి గురించి తాను ఒకలాగా చెబితే దాన్ని చాలా యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ వేరుగా వాటి స్వప్రయోజనాల కోసం వాడారంటూ ఆవేదన చెందారు.

తల్లిగా బాధపడుతున్నా… ఇలా చేయకండి…

నా కూతురు చాలా ఆరోగ్యంగా ఉంది, పుట్టినప్పుడు సాధారణ బిడ్డ లాగే ఉన్నా, అపుడు వ్యాపించిన ఒక వైరస్ వల్ల తన బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చి మానసిక ఎదుగుదల విషయంలో వెనుకబడింది. అయితే తాను చాలా చక్కగా పెరుగుతోంది. తనను చూసుకోవడం నాకు ఏ మాత్రం కష్టం కాదు. నేను 18 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను కానీ మధ్యలోనే వదిలేసాను. అప్పుడెలా పని చేయగలనో ఇప్పుడు అలానే పని చేయగలను కష్టపడుతూ నా కూతురిని పెంచడం లేదు. నేను చెప్పింది ఒకటైనతే ఇంకొకలాగా థంబ్ లైన్ పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

నాకు తెలుగు చదవడం రాకపోవడం వల్ల నాకు ఎలాంటి థంబ్స్ పెట్టారో తెలియలేదు నా ఇంటర్వ్యూకి. అయితే నాకు తెలిసిన స్నేహితులు అందరూ చూపించి అడుగుతుంటే చాలా బాధేసింది, మీరు వ్యూస్ పెంచుకోవడజం కోసం ఇతరుల విషయాలను తప్పుగా రాయకూడదు కదా. కానీ ఏవేవో హెడ్డింగ్స్ పెట్టి రాసినా కూడా చదివి కామెంట్స్ చేసినవాళ్లు చాలా మంది చాలా పొడిటివ్ గా కామెంట్స్ పెట్టారు, నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను నా కూతురు తో సంతోషంగా ఉన్నాను దయచేసి ఇలాంటివి రాయకండి అంటూ చెప్పారు ఇందు ఆనంద్.