Suma Kanakala : తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ, సినిమా ఏ హీరోదైనా ఏ డైరెక్టర్ దైనా రిలీజ్ కి ముందు సుమ తో ఒక ప్రోగ్రామ్ ఉండాల్సిందే. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఇది మాత్రం కామన్. ఇక ఒకప్పుడు సినిమాలంటే ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ గ్రాండ్ గా చేసే వాళ్ళు. ఇపుడు ఆడియో రిలీజ్ చేయడం మానేసి కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ చేస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా హోస్ట్ గా సుమ ఉండాల్సిందే. ఒక వేళ అలా ఉండకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూ సుమతో చేస్తారు ఫిల్మ్ యూనిట్. దీనికికారణం ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వడం అలాగే ఫన్నీగా సుమ పంచులతో ఇంటర్వ్యూ బోర్ కొట్టదు కాబట్టి ప్రేక్షకులకు చేరువవుతుంది.
ఆంధ్రావాలా కు నాలుగు ట్రైన్లు…
ఇక అప్పట్లో ఆడియో రిలీజ్ అనగానే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. కానీ ‘ఆంధ్రావాలా’ సినిమాకు జరిగింది మాత్రం అంతకు మించి. సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు లో జరిగిన ఆడియో ఫంక్షన్ ఇప్పటికీ ఒక సంచలనం. ఎందుకంటే ఆ ఆడియో లాంచ్ కి గవర్నమెంట్ స్పెషల్ గా నాలుగు ట్రైన్లు వేయాల్సిన వచ్చింది. ఇక ఇంతలా జనసందోహం నడుమ ఆడియో రిలీజ్ జరగడం మొదటి సారి. ఇక ఒక ట్రైన్ కి ఇంచార్జి గా సుమను వేశారట.
అక్కడ ఉన్న జనాన్ని చూసి భయపడిన సుమ షో చేయకుండా అక్కడి నుండి మధ్యలోనే వచ్చేసిందట. ఈ విషయాలను లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూరి జగన్నాథ్, సుమ.. ఆంధ్రావాలా సినిమా అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఇక హెలీకాప్టర్ లో ఎన్టీఆర్ రావాల్సింది ‘ఇంతకీ హెలీకాప్టర్ వచ్చిందా లేదా పూరి గారు’ అంటూ సుమ అడిగింది. మీ సినిమా ఫంక్షన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదా అంటూ సుమ కామెంట్స్ చేసింది. ఇక అప్పట్లో ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ మాత్రం నిజంగా ప్రభంజనం అనే చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…