రికమెండ్ చేస్తే గాని నటించని సుమన్, విజయశాంతితో సినిమా తీసి ఈ దర్శకుడు హిట్టు కొట్టాడు..!!

‌యువతరం కదిలింది సినిమా షూటింగ్ ఒంగోలులో జరగడంతో మద్రాస్ నుంచి ఇంటికి వచ్చి ఇతర పనులు చూసుకుంటున్న కృష్ణ.. యువతరం కదిలింది చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులను చూసుకోవడం జరిగింది. అలా తన స్నేహితుడైన పోకూరి బాబూరావుతో టీ కృష్ణ తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. చిరంజీవితో తీయాలనుకున్న సినిమా ఆయన ఇమేజ్ పెరగడంతో వారు తయారు చేసుకున్న కథను రద్దు చేసుకొని తిరిగి కృష్ణ ఓ అభ్యుదయ చిత్రం రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో పి.సి.రెడ్డి దర్శకత్వంలో నవోదయం చిత్రం ముచ్చర్లఅరుణ, కవిత, విజయశాంతిలపై చిత్రీకరణ జరుగుతోంది.

అక్కడికి టీ.కృష్ణ పోకూరి బాబూరావు కలిసి వెళ్లారు. తను రాసుకున్న కథలో భారతి పాత్రకు విజయశాంతి సరిగ్గా సరిపోతుందని ఆమెను సంప్రదించారు. కానీ విజయశాంతి నాన్నగారు టి.కృష్ణ నిర్మాత పోకూరి బాబురావు కొత్తగా కనిపిస్తున్నారని.. మా అమ్మాయి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారని డేట్స్ ఖాళీ లేవని అన్నారు. ఆ క్రమంలో నిర్మాత ఎమ్మెస్ రెడ్డి, దర్శకుడు పి.సి.రెడ్డి లతో రికమండ్ చేస్తే విజయశాంతి ‘నేటిభారతం’ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత అట్రాక్షన్ ఫేసు యాక్టివ్ గా ఉండే పర్సన్ కావాలని అప్పుడే తెలుగులోకి వచ్చి ఇద్దరు కిలాడీలు, అపరాధి చిత్రంలో నటించిన సుమన్ ని హీరోగా అనుకున్నారు.

కాని పి.సి.రెడ్డి చెప్పితే సుమన్ నేటి భారతం సినిమాలో నటించడానికి అంగీకరించారు. అలా1983 జూన్ లో సినిమా షూటింగ్ ప్రారంభమయింది. టి.కృష్ణకు ఇదే మొదటి చిత్రం కాబట్టి సినిమాకి సహాయ దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను తీసుకున్నారు. సినిమా ఘన విజయం సాధించి విజయవాడలో విజయోత్సవ సభలో దర్శకుడు టి కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాకి సంబంధించిన ఆలోచనలు మొత్తము నావే కానీ నన్ను దర్శకుడిని చేసింది మాత్రం ముత్యాల సుబ్బయ్య ఆయన లేకుండా ఈ సినిమాను ఊహించలేము అన్నట్టుగా టి కృష్ణ చెప్పడం గమనార్హం. టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలలో నటించడం జరిగింది.

ఈ సినిమాలో పాపులర్ అయిన పాట..”అత్తా పోదాం రావే మన ఊరి దవాఖానకు”.. బండ్ల కిష్టయ్య రాసిన ఈ గీతం ప్రజానాట్యమండలి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాదరణ పొందింది. ఈ పాటను నేటి భారతం చిత్రంలో వాడుకున్నారు. మరొక పాట అయిన..”భారతమాతను నేను బందీ నై ఉన్నాను”. అనే పాట రేపే చిత్రీకరణ అయినా లొకేషన్ ఏమిటో యూనిట్ సభ్యుల్లో ఎవరికి టి.కృష్ణ చెప్పలేదు. మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో ఓ కాలి ఫ్లోర్ ని బుక్ చేయమని ఆయన పురమాయించారు. ఆర్ట్ డైరెక్టర్ తో ఒక చెరసాల వేయించారు. అలాగే భారతదేశ పటాన్ని గీయించారు, దాని చుట్టూ ఒక తాడును చుట్టించి మధ్యలో ఇసుక పోయించి విజయశాంతికి సంకెళ్లు పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పాట చిత్రీకరణ అద్భుతంగా జరిగిందనడానికి తెరపై కనిపించిన దృశ్యాలే కారణాలుగా పేర్కొనవచ్చు. అలా మొదటి చిత్రంతో దర్శకుడు టి.కృష్ణ అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.