బిగ్ బాస్ లో తాజాగా జరిగిన 61,62 వ ఎపిసోడ్ ఎమోషనల్, గొడవలతో, విభేదాలతో రసవత్తరంగా సాగింది.తాజాగా ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇవ్వగా ఇందులో సూపర్ విలన్స్ విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత మానస్ కూర్చొని తింటుండగా ప్రియాంక అతని దగ్గరికి వచ్చి మెలికలు తిరిగింది.ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉన్నావ్ అని మానస్ అన్నాడు.
అప్పుడు ప్రియాంక వేరే వాళ్ళు అంటే ఫీల్ అయ్యే దాన్ని కాదని,మానస్ అనడంతో చాలా బాధగా ఉందని తెలిపింది.ఈ విషయం సిరి దగ్గర చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అవ్వడంతో సిరి ఓదారుస్తుంది. ఆ తర్వాత మానస్, ప్రియాంక కలిసి బెడ్ పై హగ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగ్గా, ప్రేమించుకుంటున్నారని కాజల్ చెప్పడంతో, మరి ఇంత పబ్లిక్ గానా అంటూ సన్నీ సెటైర్లు వేశాడు.
ఇక ఆ తర్వాత బిగ్ బాస్ చిక్కకు దొరకకు అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో కానీ మాస్టర్ విజేతగా నిలిచింది. ఈ విషయం పట్ల సిరి ఎమోషనల్ అవుతూ.. చందు ముక్కు తనపై ఎక్కువ బాల్స్ విసిరాడు అంటూ ఫీల్ అయింది. ఒక ఫ్రెండ్ అయి ఉండి తన పై బాల్స్ వేస్తావా అంటూ అతనిపై మండిపడింది. నువ్వు మనసులో ఒకటి పెట్టుకుంటావ్.. బయట ఒకలా ప్రవర్తిస్తావ్ అంటూ అతని పై కామెంట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తననీ హౌస్ నుంచి పంపించేయండి, వెళ్లిపోతానని ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఆమె తెలిపింది.ఈ క్రమంలోనే షణ్ముక్, దీప్తి సునైనల మధ్య రిలేషన్ కి సంబంధించి ఒక బాంబు పేల్చింది సిరి. బెడ్ పై కూర్చుని ఉన్నప్పుడు షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునయన ఇచ్చిన గిఫ్ట్ వాచ్ ని శ్రీ పెట్టుకుంటుంది. ఇన్నాళ్లు తాను పెట్టుకోలేదని అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక షణ్ముఖ్ నుంచి ఎలాంటి గిఫ్ట్ రాలేదని అందుకు చాలా బాధపడుతున్నట్టు తెలిపింది. అందుకే ఈ వాచ్ ఇప్పుడు పెట్టుకున్నట్టు సిరి తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…