నేను రిజెక్ట్ చేసిన రాజశేఖర్ 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. – దర్శకుడు సముద్ర

సినిమా రంగం విచిత్రమైనది.ఏ సినిమా విజయవంతం అవుతుందో ఏ సినిమా పరాజయం పొందుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు కొంతమంది దర్శక నిర్మాతలు కథ విన్న వెంటనే సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొన్నిసార్లు ఎక్కడో ఒక దగ్గర తప్పులో కాలేసే పరిస్థితి వస్తుంది.ఇంకొన్నిసార్లు కథ వినగానే ఓహో అనిపిస్తుంది. తీరా సినిమా ఎగ్జిక్యుషన్ లో డ్రాబ్యాక్స్ తో సినిమా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్ గా తీసిన సినిమా బ్లాక్ బస్టర్,ఇండస్ట్రీ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

అలా ఒక సినిమా ముందే హిట్టు, ఫట్టు అని కచ్చితంగా చెప్పలేమన్నది సినిమారంగం ఎరిగిన సత్యం. దాదాపు 15 సంవత్సరాలు అసోసియేట్, అసిస్టెంట్ డైరెక్టర్ గా సముద్ర పని చేయడం జరిగింది. అలా ఆర్.బి.చౌదరి పరిచయంతో ఆయన సలహాతో తమిళంలో మదర్ సెంటిమెంట్ తో నడుస్తున్న తమిళ ‘మాయి’ చిత్రాన్ని దర్శకుడు సముద్రని చూడమన్నారు. ఆ తమిళ సినిమాను చూసిన సముద్ర తాను ఆర్.బి.చౌదరి నిర్మాణంలో ఒక సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. అలా రాజశేఖర్ కి తమిళ సినిమా నచ్చడం దానికి దర్శకుడిగా సముద్రని కూడా అంగీకరించడం జరిగింది.

2001 ఆర్.బి.చౌదరి నిర్మాణం, వి.సముద్ర దర్శకత్వంలో ‘సింహరాశి’ చిత్రం విడుదలైంది. ఇందులో రాజశేఖర్, సాక్షిశివానంద్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా దర్శకుడు సముద్ర మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఆ తరువాత రాజశేఖర్ తన చిత్రాలు దర్శకుడు సముద్రతో అనుకున్నప్పటికీ కథ, ఇతర అంశాలు నచ్చకపోవడంతో దాదాపు రాజశేఖర్ నటించిన ఆరు చిత్రాలను సముద్ర రిజెక్ట్ చేయడం జరిగింది.

శేషు, భరతసింహారెడ్డి, ఆయుధం, విలన్, ఆప్తుడు, నాయకుడు లాంటి చిత్రాలు దర్శకత్వం చేసే అవకాశం సముద్రకి వచ్చినప్పటికీ ఆయన వాటిని తిరస్కరించడం జరిగింది. తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సూపర్ హిట్ అందుకుంది. 2007 కౌశిక్ మూవీస్, సముద్ర దర్శకత్వం వహించిన ‘ఎవడైతే నాకేంటి’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో రాజశేఖర్, సంవృత హీరో, హీరోయిన్ గా నటించారు. తమిళంలో నడుస్తున్న చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఎవడైతే నాకేంటి సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచనా సహకారాన్ని అందించారు.