Ismart Anjali : నాపై అత్యాచారయత్నం జరిగింది… ఇస్మార్ట్ నవ్వుల వెనుక ఎన్నో బాధలు ఉన్నాయి : ఆరోహి రావు

Ismart Anjali : tv9 లో ఇస్మార్ట్ న్యూస్ చదువుతూ బాగా ఫేమస్ అయిన తెలంగాణ అమ్మాయి ఆరోహి రావు అలియాస్ ఇస్మార్ట్ అంజలి బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఇపుడు అంజలి నేపధ్యం గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు వెతకడం మొదలు పెట్టారు. అంజలి అసలు పేరు ఆరోహి రావు, సొంతూరు పరకాల దగ్గర పల్లెటూరు. అమ్మ చిన్నతనంలో మరణించడం తో నాన్న మరో పెళ్లి చెసుకోవడం గొడవల కారణంగా అమ్మమ్మ వద్ద పెరిగింది ఆరోహి రావు. ఇక ఆరోహికి ఒక అన్న ఉన్నాడు. ఇక పదవ తరగతి వరకు పల్లెటూరు లో చదివిన ఆరోహి ఆ తరువాత వరంగల్ కు వెళ్లి పై చదువులు అక్కడే చదివింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవడంతో ఎంతో బాధను అనుభవించానని, ఈ ప్రపంచంలో మనకు ఎవరూ తోడు ఉండరని ఒంటరి అనే భావన చిన్నవయసులోనే వచ్చేసిందని చెప్పింది ఆరోహి రావు.

నాపై రేప్ అట్టెంప్ట్ జరిగింది… అవే నన్ను మార్చాయ్…

చాలా మంది అమ్మాయిలు తెలియని వయసులో సెక్సువల్ అబ్యూస్ కి గురవుతు ఉంటారని, అది వాళ్లకు తెలియకుండానే జరుగుతుందని, నాకు అలానే తెలియని వయసులో జరిగిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆరోహి పంచుకున్నారు. చిన్నతనంలో అసలు ఏమి తెలియని వయసులో తెలిసిన అన్న నా మీద అత్యాచార యత్నం చేసాడు. నాకు అది తెలియక కొడుతున్నాడని అరిచాను దాంతో ఇంట్లో వాళ్ళు రావడం అతను పారిపోవడం జరిగింది అంటూ మళ్ళీ పెద్దయ్యాక ఆ సంఘటన గుర్తొచ్చినపుడు అర్థమైంది నాకు ఏం జరిగిందో ఆ రోజు. ఇలాంటివి ఇక కొంచెం అవగాహన వచ్చాక జరగలేదు ఎవరినీ దగ్గరకు రాణిచ్చేదాన్ని కాదు. ఒక ఫోభియా లో చాలా రోజులు బతికాను అంటూ ఆరోహి తన అనుభవాలను చెప్పింది.

ఇక మీడియా రంగంలోకి వచ్చాక చిన్న చిన్న సంఘటనలు ఉన్నా నేను చాలా స్ట్రాంగ్ అందుకే అలాంటివి జరగలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నపుడు మన బాధ షేర్ చేసుకోడానికి అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నాకావకాశం లేదు, అలా చాలా క్రుంగిపోయిన రోజులు ఉన్నాయి. కానీ వాటి వల్లే నేను చాలా మొండిగా, స్ట్రాంగ్ గా తయారయ్యాను. నాకు నచ్చింది చేయాలి సక్సెస్ అయితే హ్యాపీ లేదంటే మంచి గుణపాఠం అవుతుంది. ఏదైనా నాకు నచ్చే చేసాను కాబట్టి పడినా నేనే లేస్తాను అనే నిర్ణయానికి వచ్చేసాను. ప్రతి ఆడపిల్ల అలా స్ట్రాంగ్ గా ఉండాలి అయితే ఆత్మాభిమానం కోల్పోకూడదు అంటూ చెప్పింది.