Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!

Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!

Naga Chaitanya: నాగార్జున, నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘బంగార్రాజు’.  ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఆరేళ్ల క్రితం…2016 లో సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సూపర్ డూపర్ హిట్ అయింది.

Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!
Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!

నాగార్జున కెరీర్ లో మంచి వసూళ్లను సాధించింది. అయితే దీనికి సీక్వెల్ గా బంగార్రాజు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యక్రిష్ణ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే పలుమార్ల ప్రెస్ మీట్లు నిర్వహించింది చిత్ర యూనిట్.

పోయిన సంవత్సరం ఏప్రిల్ 9న జీవో వచ్చింది..

అయితే ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలపై నాగార్జునను విలేకర్లు ప్రశ్నించగా… ఏపీలో టికెట్ రేట్ల వల్ల మాకేం ఇబ్బందులు లేవంటూ.. సమాధానం ఇచ్చారు. మా సినిమాకు సరిపోయేలా టికెట్ రేట్లు ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దూమారమే రేపాయి. తాజాగా నాగ చైతన్య స్పందించాడు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 9న జీవో వచ్చింది.. మా సినిమా ఆగస్ట్ లో మొదలైంది. మేము ఆ టికెట్ రేట్ల ప్రకారమే బడ్జెట్ వేసుకున్నాం. అందువలన మాకు ఎలాంటి సమస్య లేదు. అవి పెరిగితే మా సినిమాకు ఇంకా ప్లస్ అవుతుందని నాగ చైతన్య తెలియజేశాడు.