Naga Chaitanya: టికెట్ రేట్లు పెంచితే బాగుండేది కానీ.. టికెట్ల వ్యవహారం పై చైతూ స్పందన ఇదే!
Naga Chaitanya: నాగార్జున, నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘బంగార్రాజు’. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఆరేళ్ల క్రితం…2016 లో సంక్రాంతి బరిలో వచ్చిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సూపర్ డూపర్ హిట్ అయింది.
నాగార్జున కెరీర్ లో మంచి వసూళ్లను సాధించింది. అయితే దీనికి సీక్వెల్ గా బంగార్రాజు వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యక్రిష్ణ నటిస్తుండగా… నాగ చైతన్య సరసన బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే పలుమార్ల ప్రెస్ మీట్లు నిర్వహించింది చిత్ర యూనిట్.
అయితే ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలపై నాగార్జునను విలేకర్లు ప్రశ్నించగా… ఏపీలో టికెట్ రేట్ల వల్ల మాకేం ఇబ్బందులు లేవంటూ.. సమాధానం ఇచ్చారు. మా సినిమాకు సరిపోయేలా టికెట్ రేట్లు ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దూమారమే రేపాయి. తాజాగా నాగ చైతన్య స్పందించాడు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 9న జీవో వచ్చింది.. మా సినిమా ఆగస్ట్ లో మొదలైంది. మేము ఆ టికెట్ రేట్ల ప్రకారమే బడ్జెట్ వేసుకున్నాం. అందువలన మాకు ఎలాంటి సమస్య లేదు. అవి పెరిగితే మా సినిమాకు ఇంకా ప్లస్ అవుతుందని నాగ చైతన్య తెలియజేశాడు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…