Featured

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

Sarkaaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ సర్కార్ వారి పాట’. దాదాపుగా ఏడాది కాలం నుంచి మహేష్ బాబును తెరపైన చూడలేదు. గతేడాది వచ్చిన ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాలో ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను అలరించినప్పటికీ.. అనుకున్నంతగా పెద్ద హిట్ సాధించలేదు. 

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

ఈ సంక్రాంతికైనా.. తమ స్టార్ హీరోను థియేటర్లలో చూస్తమని అనుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.  ప్రస్తుతం మహేష్ బాబు కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు మహేష్. అయితే ఈలోపలే కరోనా ఎటాక్ కూడా అయింది.

Sarkaru Vaari Paata: మహేష్ బాబు లేకుండా ‘‘సర్కారు వారి పాట’’ షూటింగ్.. ఎందుకో తెలుసా?

దీంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. దీనితో పాటు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో బాధలో ఉన్నారు మహేష్. చిన్నప్పటి నుంచి తన అన్న రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎనలేని గౌరవం.


మహేష్ లేకుండానే ‘సర్కారు వారి పాట’..

వీటన్నింటి మధ్య సర్కారు వారి పాట షూటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా కరోనా సోకడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ లేకుండానే సర్కార్ వారి పాట షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాను ఈ ఏడాది ఎప్రిల్ 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.  సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. యువ సంగీత కెరటం థమన్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago