Sarkaaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ సర్కార్ వారి పాట’. దాదాపుగా ఏడాది కాలం నుంచి మహేష్ బాబును తెరపైన చూడలేదు. గతేడాది వచ్చిన ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమాలో ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను అలరించినప్పటికీ.. అనుకున్నంతగా పెద్ద హిట్ సాధించలేదు.

ఈ సంక్రాంతికైనా.. తమ స్టార్ హీరోను థియేటర్లలో చూస్తమని అనుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ప్రస్తుతం మహేష్ బాబు కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు మహేష్. అయితే ఈలోపలే కరోనా ఎటాక్ కూడా అయింది.

దీంతో హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. దీనితో పాటు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో బాధలో ఉన్నారు మహేష్. చిన్నప్పటి నుంచి తన అన్న రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎనలేని గౌరవం.
మహేష్ లేకుండానే ‘సర్కారు వారి పాట’..
వీటన్నింటి మధ్య సర్కారు వారి పాట షూటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ కు కూడా కరోనా సోకడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ లేకుండానే సర్కార్ వారి పాట షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాను ఈ ఏడాది ఎప్రిల్ 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. యువ సంగీత కెరటం థమన్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.































